Adilabad: జొన్న రైతులు ఆందోళన చెందవద్దు.. ప్రతి గింజనూ కొంటాం
ఆదిలాబాద్: జొన్న రైతులకు ఎమ్మెల్యే పాయల్ భరోసా.. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు..
సాత్నాల మండలం కాన్పు మేడిగూడ రైతు వేదికలో జొన్నలకు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పటివరకు అనేక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జొన్నలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
త్వరలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రైతుల్లో ఒక ఆత్రుత ఉందని ఎక్కడ ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయదేమో ఆత్రుత కారణంగా మార్కెట్ యార్డ్ లలో రద్దీ ఏర్పడి గందరగోళం నెలకొందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. జొన్న పంట కోటను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

