Dailyhunt
Adilabad: క్రూరంగా పశువుల తరలిస్తే అంతే సంగతులు అదిలాబాద్ ఎస్పీ వార్నింగ్

Adilabad: క్రూరంగా పశువుల తరలిస్తే అంతే సంగతులు అదిలాబాద్ ఎస్పీ వార్నింగ్

hmtv 2 weeks ago

Adilabad: క్రూరంగా పశువుల తరలిస్తే అంతే సంగతులు అదిలాబాద్ ఎస్పీ వార్నింగ్

ఆదిలాబాద్: పశువుల అక్రమ రవాణా కు అడ్డుకట్ట - ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఉక్కు పాదం మోపేందుకు అదిలాబాద్ జిల్లా పోలీసులు సిద్ధమయ్యారు..

ఈనెల 27వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను అరికట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జైనథ్ మండలం, పిప్పర్ వాడ 44 నెంబర్ జాతీయ రహదారితో పాటు ఆనంద్ పూర్ అంతర్రాష్ట్ర రహదారి, అదేవిధంగా బేల మండలంలోని శంకర్ గూడ, కనమడుగు మండలంలోని లక్ష్మీపూర్.

లోకారి (గాదిగూడ) ఉట్నూర్ ఎక్స్ రోడ్, ఘన్ పూర్ బూత్ మండలంలో మొత్తం, అంతర్రాష్ట్ర రహదారులపై ఏడు చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు పోలీసులు.పోలీస్ సిబ్బందిచే 24 గంటలు తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చెక్పోస్ట్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం చేశారు.. చెక్పోస్ట్ కు వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎలాంటి పశువుల అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

చెక్పోస్ట్లో ఐదు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉండగా ఎస్ఐ స్థాయి అధికారిచే పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. సిబ్బంది షిఫ్ట్ విధానంలో విధుల నిర్వహణ చేపట్టాలని ప్రతిక్షణం అప్రమత్తతో ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. పశువులతో ఉన్న వాహనాల లో సరైన పత్రాలను, పశువుల యొక్క స్థితిగతులను పరిశీలించాలని తెలిపారు. వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పశువులు లభించినట్లయితే వెంటనే నిర్దేశించిన గోశాలలకు తరలించాలని తెలిపారు. జిల్లాలో ఎండలు మండిపోతున్న సందర్భంలో సిబ్బంది చెక్పోస్టుల వద్ద జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu