Adilabad: రిమ్స్‌లో కలకలం పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు
అదిలాబాద్: రిమ్స్ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ కళాశాల అధికారి లైంగిక వేధింపులు కలకలం రేపుతోంది....
రెండు రోజుల క్రితం ఆపరేషన్ థియేటర్లో నర్సింగ్ కళాశాల అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు పరారీలో ఉన్నారు.. ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్సీ షా సీరియస్ గా స్పందిస్తూ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు ఆదేశాలు జారీ చేశారు.

