Adilabad: త్వరలోనే అదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఎయిర్‌పోర్ట్
ఆదిలాబాద్: పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ నగేశ్ తెలిపారు.
పట్టణంలోని పలు వార్డుల్లో రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూష భూమిపూజ చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, తాగునీటి సమస్య లేకుండా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
వెనుకబడిన అదిలాబాద్ ను అభివృద్ధి పథంలో నడపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్ పార్కుతో పాటు డిఫెన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆదిలాబాద్ త్వరలోనే కార్పొరేషన్‌గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూష మాట్లాడుతూ.. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

