Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adilabad: వార్త రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే

Adilabad: వార్త రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే

hmtv 2 weeks ago

Adilabad: వార్త రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే

Adilabad: ఆదిలాబాద్ లో తన చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఒక పత్రిక కల్పిత వార్తలు రాస్తున్నదని, ఆ పత్రిక ఓ పార్టీకి కరపత్రమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు.

గురువారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ పత్రికలో తనపై వచ్చిన కథనాన్ని ఖండించారు.

ఇండస్ట్రియల్ కారిడార్ లో 300 కోట్ల భూముల లావాదేవీలు జరిగితే వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు చెబుతున్నారు అన్నారు. తన ఉన్న భూమిని అమ్ముకుంటే ఎదో మతలబు ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ తనపై దుష్ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. తాన గమ్యం, ఆలోచన అంతా అభివృద్ధి గురించే అన్నారు. గత పదేళ్ల కాలంలో మాజీ మంత్రి జోగురామన్న చేయలేని పనులు చేస్తున్నానన్నారు. టెక్స్ టైల్ పార్క్ కు గతంలో అవకాశం ఉన్నా జోగురామన్న చేతకాని తనం వల్లనే వరంగల్ కు వెళ్లిపోయిందని ఆరోపించారు. ఓ పత్రికలో తనపై వచ్చిన కథనంపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu