Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Allagadda: ఆళ్లగడ్డ హైవేపై లారీని ఢీకొట్టిన హైదరాబాద్ బస్సు

Allagadda: ఆళ్లగడ్డ హైవేపై లారీని ఢీకొట్టిన హైదరాబాద్ బస్సు

hmtv 1 week ago

Allagadda: ఆళ్లగడ్డ సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన జెబిటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. 30 మంది ప్రయాణికులతో అరుణాచలం నుండి హైదరాబాద్ వెళుతున్న జై భారత్ ట్రావెల్స్ బస్సు.

నిదానంగా వెళుతున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు. చిత్తూరు జిల్లా సుగం కు చెందిన సుబ్రహ్మణ్యం (50) ప్రయాణికుడు మృతి. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 30 మంది ప్రయాణికులతో అరుణాచలం నుండి హైదరాబాద్ వెళ్తున్న జై భారత్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా సుగంకు చెందిన సుబ్రహ్మణ్యం (50) అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ బస్సు అతుక్కుపోగా జెసిబి సాయంతో పోలీసులు పక్కకు జరిపారు. ఈ ఘటనలో జేబీటీ ట్రావెల్స్ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu