Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amalapuram: తడికోనలో 'క్రాప్ హాలిడే' ప్రకటించిన రైతులు!

Amalapuram: తడికోనలో 'క్రాప్ హాలిడే' ప్రకటించిన రైతులు!

hmtv 3 weeks ago

Amalapuram: తడికోనలో 'క్రాప్ హాలిడే' ప్రకటించిన రైతులు!

అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని తడికోన గ్రామంలో రైతుల వినూత్న నిరసన.గ్రామంలో రైతులు "క్రాప్ హాలిడే" ప్రకటించారు.సుమారు 250 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు చేయబోమని నిర్ణయం.

ఆక్వా చెరువుల నుంచి కలుషిత నీరు వ్యవసాయ పొలాల్లోకి చేరుతోందని రైతుల ఆరోపణ.అల్లవరం మండలం తాడికొన గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్‌కు వినతిపత్రం.గత 20 సంవత్సరాలుగా సాగు నీరు కలుషితమవుతోందని రైతుల ఆవేదన.డ్రైనేజీ వ్యర్థాలు పంటకాలువల్లోకి చేరి సాగునీరు కలుషితమవుతోందని ఆరోపణ.

సమీప ఆక్వా చెరువుల నుంచి సజ్జనీటిని (స్పిల్ వాటర్) నేరుగా పంటకాలువల్లోకి వదులుతున్నారని ఫిర్యాదు.కలుషిత నీటి కారణంగా వ్యవసాయ భూముల సారవంత తగ్గి, పంట దిగుబడులు పడిపోతున్నాయని రైతుల వేదన.పంటకాలువలను శుభ్రపరచి, డ్రైనేజీ మరియు ఆక్వా వ్యర్థాలు కాలువల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu