Anantapur: అనంతపురం అమ్మాయి సత్తా: మెరిటోరియస్ అవార్డు అందుకున్న అనురాధ!
అనంతపురం జిల్లా: మారుమూల గ్రామమైన సోదనాపల్లికి చెందిన డాల్ అనురాధ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుతూ అరుదైన గౌరవాన్ని అందుకుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన డాల్ అనురాధ, తన కృషి మరియు ప్రతిభతో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది.
విజయవాడలో నిర్వహించిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ "మెరిటోరియస్ అవార్డ్స్" కార్యక్రమంలో అనురాధకు ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాల్ అనురాధ తన తల్లిదండ్రులతో కలిసి పాల్గొని అవార్డును అందుకుంది.
ఈ సందర్భంగా డాల్ అనురాధ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమని పేర్కొంది.
అనురాధ తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ కుమార్తె కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని చెప్పారు. ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
అలాగే ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్య ద్వారానే జీవితంలో విజయాలు సాధించవచ్చని సూచించారు. డాల్ అనురాధ సాధించిన ఈ ఘనత సోదనాపల్లి గ్రామంతో పాటు అనంతపురం జిల్లాకు కూడా గర్వకారణంగా నిలిచింది.

