Anantapur: అనంతపురం కలెక్టరేట్‌లో దివ్యాంగుడి ప్లకార్డు నిరసన
Anantapur: అనంతపురం జిల్లాకు చెందిన పరమేష్ నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో వికలాంగుల కోటాలో నిరుపేద దివ్యాంగులకు ఉపాధి కల్పించాలంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశారు.
దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమని పరమేష్ హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని వికలాంగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

