Anantapur: బైక్‌లు అమ్మకానికి పెట్టాం.. పెట్రో ధరలపై సీపీఐ ఆగ్రహం
Anantapur: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని అనంతపురంలో సిపిఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.
టవర్ క్లాక్ సమీపంలో తోపుడుబండ్లపై ద్విచక్ర వాహనాలను ఎక్కించి వాహనాలను అమ్మకం చేస్తున్నట్లు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో ద్విచక్ర వాహనాలు నడపలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

