Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anantapur: మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తాం.. టీడీపీ నేతలు

Anantapur: మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తాం.. టీడీపీ నేతలు

hmtv 1 week ago

Anantapur: మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తాం.. టీడీపీ నేతలు

Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం నిర్వహించారు.

అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజుతో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

కూటమిలో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయించాల్సిన స్థానాలతో పాటు మేయర్ అభ్యర్థి ఎంపికపై నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మేయర్ స్థానం ఏ పార్టీకి కేటాయించినా కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారని ఏరాసు ప్రతాపరెడ్డి, దగ్గుపాటి ప్రసాద్, పూల నాగరాజు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మేయర్ అభ్యర్థి ఎవరన్నది గురువారం రాత్రి లేదా శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో మాదిరిగా అరాచకాలకు తావులేకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని తెలిపారు.

పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ రక్షణ కావాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపుతోందని విమర్శించారు.అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి మేయర్ స్థానంలో మెరుగైన మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.

గతంలో ఎన్నికలు ఎలా నిర్వహించారో ప్రజలందరికీ తెలుసని, పోలింగ్ బూత్‌లలో కనీసం ఏజెంట్లు కూడా లేకుండా ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu