Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anantapur: ఓటు హక్కుపై ఆందోళన వద్దు SIR ప్రక్రియపై ఎమ్మెల్యే క్లారిటీ!

Anantapur: ఓటు హక్కుపై ఆందోళన వద్దు SIR ప్రక్రియపై ఎమ్మెల్యే క్లారిటీ!

hmtv 2 weeks ago

Anantapur: ఓటు హక్కుపై ఆందోళన వద్దు SIR ప్రక్రియపై ఎమ్మెల్యే క్లారిటీ!

Anantapur: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కొందరు అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నారు, ప్రజలెవరూ తమ ఓటు హక్కు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు స్పష్టం చేశారు.

మారుతి నగర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం 2002ను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఒకవేళ ఆనాటి వివరాలు అందుబాటులో లేకపోతే, ప్రభుత్వం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏవైనా రెండు కార్డులను అధికారులకు అందించవచ్చు అని వృద్ధులు, చదువు రాని వారికి సహాయం చేయడానికి బిఎల్ఓల (BLO) సమక్షంలో తమ పార్టీ బిఎల్ఏలు (BLA) అందుబాటులో ఉంటారు. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం.

ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా జిల్లా కలెక్టర్ గత నెల రోజులుగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియపై అత్యంత సీరియస్‌గా పని చేస్తున్నారు. అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి, ఎస్ఐఆర్ 100% విజయవంతం కావడానికి ప్రజలంతా అధికార యంత్రాంగానికి సహకరించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి తెలిపారు. ఎవరు కూడా తమ ఓటు తొలగుతుందని భయపడాల్సిన పనిలేదని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu