Dailyhunt
Anna Lezhneva: పవన్‌కు ఇష్టమైన వంటలివే.. అన్నా లెజినోవా ఆసక్తికర వ్యాఖ్యలు!

Anna Lezhneva: పవన్‌కు ఇష్టమైన వంటలివే.. అన్నా లెజినోవా ఆసక్తికర వ్యాఖ్యలు!

hmtv 2 hrs ago

Anna Lezhneva: పవన్‌కు ఇష్టమైన వంటలివే.. అన్నా లెజినోవా ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా ఫ్యామిలీ కోడలిగా, జనసేనాని పవన్ కళ్యాణ్ భార్యగా అందరికీ సుపరిచితురాలైన అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మెగా కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

ఫ్యాన్స్‌తో సరదాగా చిట్‌చాట్

తాజాగా అన్నా లెజినోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె ఓపెన్‌గా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా వంటల గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అత్తమ్మే గురువు.. బిర్యానీ నుంచి చేపల పులుసు వరకు!

మీరు వంట చేయగలరా? అని ఓ అభిమాని అడగగా.. తన వంట నేర్చుకున్న విధానాన్ని ఆమె వివరించారు. "మా అత్తమ్మ (పవన్ కళ్యాణ్ తల్లి) దగ్గరే నేను చాలా వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ వంటి టిఫిన్లతో పాటు కర్రీలు, పప్పులు, చేపల పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు మరియు బిర్యానీ వంటి ఎన్నో వంటకాలు చేయడం నేర్చుకున్నాను. వెజ్ వంటలు చేయడంలో నాకు మంచి పట్టు ఉంది" అని అన్నా తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన ఆహారం ఇదే!

అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రశ్న.. "పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన వంటకం ఏది?" అని అడగగా, అన్నా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. "ఆయనకు అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఆ వంటను కూడా నేను అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అలాగే ఆయన వదినమ్మ సురేఖ గారు (మెగాస్టార్ చిరంజీవి భార్య) చేసే చేపల పులుసును కూడా పవన్ చాలా ఇష్టంగా తింటారు" అని వెల్లడించారు.

మెగా ఫ్యామిలీలోని బంధాలు, వ్యక్తిగత అభిరుచుల గురించి అన్నా లెజినోవా ఇలా సరదాగా ముచ్చటించడం మెగా అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె చేస్తున్న ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu