AP 10th Class Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
AP 10th Class Results 2026: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు.
ఈ ఏడాది సుమారు 6,30,000 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90% కాగా, బాలుర ఉత్తీర్ణత 82.68% గా నమోదైంది.
ఫలితాలను ఎలా చూసుకోవాలి?
ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. అయితే విద్యార్థులు ఇది మాత్రమే కాకుండా ఎస్ఎంఎస్ వాట్సాప్ ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా పది పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు చెక్ చేయడానికి ముందుగా 9552300009 నెంబర్ మీ ఫోన్ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సప్‌లో ఈ నెంబర్ కి 'Hi' అని మెసేజ్ చేయాలి.
అప్పుడు రెస్పాన్స్ వస్తుంది. అక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంపిక చేసుకొని 'ఏపీ ఎస్ఎస్ సీ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఏపీ SSC క్రమ సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు పీడీఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్ ద్వారా మీకు ఫలితాలు వచ్చేస్తాయి.
మంత్రి లోకేష్ అభినందనలు:
ఫలితాల విడుదల అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడకుండా త్వరలో నిర్వహించబోయే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

