Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Armoor: ఐలాపూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐకాన్ క్రికెట్ మ్యాచ్‌లు!

Armoor: ఐలాపూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐకాన్ క్రికెట్ మ్యాచ్‌లు!

hmtv 1 week ago

Armoor: ఐలాపూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐకాన్ క్రికెట్ మ్యాచ్‌లు!

ఆర్మూర్ న్యూస్: క్రికెట్ పై అభిమానులలో వున్న మక్కువను గమనించిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఐకాన్ క్రికెట్ మ్యాచ్ లను పెట్టేందుకు సిద్ధపండింది.

ఈ నెల 15 న ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకాన్ క్రికెట్ మ్యాచ్ ను ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ, చింరాజ్ పల్లి సర్పంచ్ మురళి, మల్లారం ఉప సర్పంచ్ మహమూద్ లు ప్రారంభించారు. అనంతరం ఐలాపూర్ సర్పంచ్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చనీ అన్నారు.

యువత లో దాగివున్న నైపుణ్యత పట్టుదల మెరుగు పడాలంటే ఇలాంటి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. యువకులు క్రీడల పట్ల మక్కువ చూపాలని పిలుపునిచ్చారు. మరో వైపు యువత డ్రగ్స్, గంజాయి వైపు ఆసక్తి చూపుతున్నారని, వాటికి బానిసై తమ బంగారు భవితను కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి క్రీడలు వల్ల వారిలో చెడు వ్యసనాలు దూరమై క్రీడల్లో రాణిస్తారని అన్నారు. అయితే ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్ టీంకు 25,555/- రూపాయలు, అలాగే రన్నర్ టీమ్ కు 15,555/- రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu