Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Armoor: చేపూర్ లో బడిబాట సందడి.. ప్రభుత్వ బడులే ముద్దు!

Armoor: చేపూర్ లో బడిబాట సందడి.. ప్రభుత్వ బడులే ముద్దు!

hmtv 1 week ago

Armoor: చేపూర్ లో బడిబాట సందడి.. ప్రభుత్వ బడులే ముద్దు!

అర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించాలని విద్యా వారోత్సవాల సందర్భంగా "ప్రైవేట్ కు వద్దు...ప్రభుత్వ పాఠశాలే ముద్దు" అంటూ గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో గ్రామంలోని వీధివీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతనకుమారి,ఉప సర్పంచ్ చరణ్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీనుగు నాగరాజు, సభ్యులు శ్రీనివాస్,సంజీవ్, దశరథ్,సురేష్ ఉపాధ్యాయులు సంగెం అశోక్, సౌడ రవి, గంగాధర్, లింబాద్రి,విక్రమ్, చంద్రకళ, వనజ,గంగాధర్, మనీష్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, చంద్రశేఖర్,రాజారాం,హరిపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారాం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వివిధ వంటకాలతో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.అనంతరం స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సీ టాపర్స్ గా ప్రథమ స్థానంలో నిలిచిన నయన శ్రీ, ద్వితీయ స్థానంలో కీర్తి అమూల్య, తృతీయ స్థానంలో కనికరం ఆశ్రితులను శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాస ఆనంద్,కొండవీటి శ్యాంప్రసాద్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu