Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Armoor: గీతాకార్మికులని ఆదుకోవాలి: డొంకేశ్వర్ మండలం గౌడ సంఘం నాయకులు

Armoor: గీతాకార్మికులని ఆదుకోవాలి: డొంకేశ్వర్ మండలం గౌడ సంఘం నాయకులు

hmtv 1 week ago

Armoor: గీతాకార్మికులని ఆదుకోవాలి: డొంకేశ్వర్ మండలం గౌడ సంఘం నాయకులు

Armoor: అర్మూర్ నియోజకవర్గ డొంకేశ్వర్ న్యూస్ : డొంకేశ్వర్ మండల్ మరంపల్లి గ్రామ చెరువు కట్ట పైన ఉన్న ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేయడం తో మండల గౌడ సంఘం నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

డొంకశ్వర్ మండల గౌడ్ సంఘ అధ్యక్షుడు:

ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షుడు నారాగౌడ్ మాట్లాడుతూ ఈత చెట్లు కాలిపోవడానికి కారణమైన వారి పై కటిన చర్యలు తీసుకోవాలని ఈ ఈత చెట్ల పై గౌడ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అని ఈ సంఘటన వల్ల నష్టపోయిన గౌడ కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని నష్టాన్ని అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు

అదే విధంగా చెరువు దగ్గర మోటారు బిగించి మళ్ళీ చెట్లు పెంచడానికి విత్తనాలు ఇవ్వాలని అధికారులను కోరారు ఉపాధి హామీ లో మరల చెట్ల పెంపకానికి సహాయం చేయాలని అధికారులను కోరారు. .ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల గౌడ సంఘం అధ్యక్షులు నారా గౌడ్ , గౌరవ అధ్యక్షులు దశ గౌడ్ , గౌడ సంఘం నాయకులు మోత్కురి నర్సాగౌడ్,, సాయ గౌడ్,నాగేష్ గౌడ్,రాజు గౌడ్,శేఖర్ గౌడ్,మురళి గౌడ్ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu