Dailyhunt
Armoor: గ్రామ అభివృద్ధిలో తగ్గేదే లే: చేపూర్ సర్పంచ్ శాంతి కుమార్ ధీమా

Armoor: గ్రామ అభివృద్ధిలో తగ్గేదే లే: చేపూర్ సర్పంచ్ శాంతి కుమార్ ధీమా

hmtv 1 week ago

Armoor: గ్రామ అభివృద్ధిలో తగ్గేదే లే: చేపూర్ సర్పంచ్ శాంతి కుమార్ ధీమా

ఆర్మూర్ మండల్ న్యూస్: జిల్లా కేంద్ర చేపూర్ గ్రామంలో హైటెక్ సెంట్రల్ లైట్ వెంకటేశ్వర స్వామి,హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ హైటెక్ సెంట్రల్ లైట్లు ను గ్రామ సర్పంచ్ శాంతి కుమార్ చేతిలో మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, హనుమాన్ స్వాములకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం రెండు హైటెక్ లైట్స్ లను కష్టపడి, మన కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి, సీనియర్ మంత్రులతో మాట్లాడి, కొట్లాడి తేవడం జరిగింది, రెండు లైట్లలో ఒకటి మందిరానికి, మరొకటి ఎస్సి వాడకు అది త్వరలో పనులు ప్రారంభిస్తామంటూ ప్రజలకు తెలుపుతూ,హనుమాన్ జయంతి సందర్భంగా అలాగే నిరంతరం వచ్చే భక్తులు 24 గంటలు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, కాబట్టి హనుమాన్ స్వాములకు కూడా ఎలాంటి కష్టం లేకుండా ఉంటుందని ఆలోచనతో మందిర ఆవరణలో మొత్తం చీకటి ఉండడంతో, మొదట ఆలయంలో ఫిట్ చేయడం జరిగింది.

దీని యొక్క ధర సుమారు 1,30,000 ఉంటుంది, మనం ప్రజల కోసం పనిచేస్తూ, గ్రామం ని అభివృద్ధి చేసుకుందామంటూ నూతనంగా ఎన్నిక కమిటీ మెంబర్స్ కి కోరుతూ, మనందరం కలిసి మెలిసి ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాం, 18 సంవత్సరాల కలని నెరవేర్చు, ఇటీవలే భీమన్న బీరప్ప మందిరం దగ్గర కూడా లైట్లు నిర్వహించబడినది, నాతో పాటు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లంతా కలిసి ఒక నెల నుంచి కష్టపడి మన ఊరు ప్రజలకు మూడు పూటల లీలు ఇవ్వడం జరిగింది, అంటూ మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, నూతన కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu