Dailyhunt
Arshdeep Singh: పంజాబీ నటిని పటాయించిన టీమిండియా పేసర్.. ఫోటోలు వైరల్!

Arshdeep Singh: పంజాబీ నటిని పటాయించిన టీమిండియా పేసర్.. ఫోటోలు వైరల్!

hmtv 5 days ago

Arshdeep Singh: పంజాబీ నటిని పటాయించిన టీమిండియా పేసర్.. ఫోటోలు వైరల్!

Arshdeep Singh: భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా అతడు తన స్నాప్‌చాట్ అకౌంట్‌లో ఓ అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటో షేర్ చేయడం ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫోటోలోని అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. ఆ టాటు పంజాబ్‌ మోడల్, నటి సమ్రీన్ కౌర్‌దే అని నెటిజెన్స్ అంటున్నారు. అర్ష్‌దీప్, సమ్రీన్ డేటింగ్‌లో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు సమ్రీన్ కౌర్ హాజరయ్యారు. పంజాబ్ జెర్సీతో స్టేడియంలో సందడి చేశారు. పంజాబ్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. ఈ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అర్ష్‌దీప్ సింగ్, సమ్రీన్ ప్రేమలో ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అటు అర్ష్‌దీప్ గానీ, ఇటు సమ్రీన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరి లవ్ స్టోరీపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. 'పంజాబీ నటినే పటాయించిన అర్ష్‌దీప్' అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

పంజాబీ చిత్ర పరిశ్రమలో సమ్రీన్ కౌర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మ్యూజిక్ ఆల్బమ్స్‌తో అలరించి.. ఆపై వెండి తెరకు పరిచయమయ్యారు. పలు సినిమాలతో పంజాబ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లోనూ '83' సినిమాలో సమ్రీన్ కీలక పాత్ర పోషించారు. 26 ఏళ్ల సమ్రీన్ 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదవుకున్న ఆమె ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్‌కు 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu