Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Atmakur: ఆత్మకూరు టిడ్కో గృహాల్లో పోలీసుల మెరుపు దాడి!

Atmakur: ఆత్మకూరు టిడ్కో గృహాల్లో పోలీసుల మెరుపు దాడి!

hmtv 2 days ago

Atmakur: ఆత్మకూరు టిడ్కో గృహాల్లో పోలీసుల మెరుపు దాడి!

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

సిఐ జి.గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సక్రమ రికార్డులు లేని 30 మోటార్ సైకిళ్లు, నాలుగు ఆటోలు, నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ గంగాధర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం.లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, రికార్డు లేని అనుమానాస్పద వాహనాలను కలిగి ఉండరాదని,ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని ఆయన సూచించారు.

టిడ్కో సముదాయంలోని అన్ని బ్లాకులలోని ఇళ్లలో పోలీసులు నిశితంగా పరిశీలించి అక్కడ ప్రజలతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు స్థానిక డిఎస్పీ కే. వేణుగోపాల్ సూచనలతో తాము కార్డెన్ సెర్చ్ తరచూ నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యమని సిఐ గంగాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu