Dailyhunt
Atmakur: ప్రయాణికుల పాట్లు.. అధికారుల నిర్లక్ష్యం

Atmakur: ప్రయాణికుల పాట్లు.. అధికారుల నిర్లక్ష్యం

hmtv 1 week ago

Atmakur: ప్రయాణికుల పాట్లు.. అధికారుల నిర్లక్ష్యం

Atmakur: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని బస్టాండ్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు సర్వీసుల రాకపోకల వివరాలు తెలిపే సమయపాలన బోర్డు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

అనంతసాగరం మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఉండగా వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఆత్మకూరు, నెల్లూరు, బద్వేల్, రాపూరు, ఉదయగిరి, సోమశిల ప్రాంతాలకు అనంతసాగరం చేరుకొని ప్రయాణం సాగిస్తారు.

అయితే బస్సు సర్వీసులు తిరిగే సమయం తెలియక బస్టాండ్ సమీపంలోని అంగళ్ళ వాళ్లను అడిగిన తమకు తెలియదని చెబుతుండటంతో ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాక బస్టాండ్ లో కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో బస్టాండ్ వెలుపల అంగళ్ళ వద్దకు వెళ్లి నీరు తాగేందుకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి బస్సుల రాకపోకల వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu