Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Atmakuru: మహిమలూరులో డొక్కా సీతమ్మ భోజనశాల ప్రారంభం!

Atmakuru: మహిమలూరులో డొక్కా సీతమ్మ భోజనశాల ప్రారంభం!

hmtv 3 weeks ago

Atmakuru: మహిమలూరులో డొక్కా సీతమ్మ భోజనశాల ప్రారంభం!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులోని వాకాటి నరసింహారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటు చేసిన భోజనశాలను శుక్రవారం ప్రారంభించారు.

ఆత్మకూరు ఉప విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి అనంతలక్ష్మి, చలపతిరావు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు సంయుక్తంగా భోజనశాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆత్మకూరు మండలంలో తొలి డొక్కా సీతమ్మ భోజనశాల మహిమలూరు పాఠశాలలో ఏర్పాటు కావడం ఆనందదాయకమన్నారు.

విద్యార్థులందరూ ప్రతిరోజూ సహపంక్తి భోజనంలో పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సహపంక్తి భోజనం ద్వారా విద్యార్థుల్లో సమానత్వ భావన, ఐక్యత మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు.అనంతరం పాఠశాలలో అమలవుతున్న ఎస్‌ఎస్‌సీ మిషన్ మార్చ్-2027 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, బడిబయట పిల్లల వివరాలు, విద్యార్థుల విద్యా ప్రగతిపై ఆరా తీశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, కుక్‌లు, హెల్పర్లతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు.

గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలు మరింత మెరుగ్గా సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu