Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Avatar: అవతార్ 4, 5 భాగాలపై జేమ్స్ కామెరాన్ సంచలన ప్రకటన

Avatar: అవతార్ 4, 5 భాగాలపై జేమ్స్ కామెరాన్ సంచలన ప్రకటన

hmtv 6 days ago

Avatar: అవతార్ 4, 5 భాగాలపై జేమ్స్ కామెరాన్ సంచలన ప్రకటన

Avatar: ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిన 'అవతార్' సిరీస్ తదుపరి భాగాలపై దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సిరీస్‌లో రాబోయే నాలుగు , ఐదవ భాగాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని, అయితే ఈసారి సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో వీటిని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఖర్చు, సమయాన్ని తగ్గించడమే సరికొత్త లక్ష్యం

ప్రముఖ అంతర్జాతీయ పాడ్‌కాస్ట్ వేదికగా జేమ్స్ కామెరాన్ మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుల భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను కొన్ని సరికొత్త కథలపై పని చేస్తున్నానని, అందులో భాగమే అవతార్ తదుపరి చిత్రాలని తెలిపారు. ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో కూడుకున్నవి కావడమే కాకుండా, నిర్మాణానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈసారి గత చిత్రాల కంటే సగం సమయంలో, కేవలం మూడింట రెండు వంతుల ఖర్చుతోనే వీటిని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు.

టెక్నాలజీని రీసెర్చ్ చేయడానికి ఏడాది సమయం

ఈ సరికొత్త నిర్మాణ విప్లవానికి సంబంధించిన సాంకేతికతను అధ్యయనం చేయడానికి తమ బృందానికి కనీసం ఏడాది సమయం పడుతుందని కామెరాన్ వివరించారు. ఈ లోగా తాను స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంతో పాటు ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెడతానని చెప్పారు. 2009లో వచ్చిన మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత, 2022లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్', ఆపై 2025లో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.

విడుదల తేదీలు, ఇతర ప్రాజెక్టులు

జేక్, నావి జాతి మనుగడ కోసం సాగే పోరాట నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ తదుపరి భాగాల విడుదల తేదీలపై కూడా ఇప్పటికే ఒక అంచనా ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, 'అవతార్ 4' చిత్రం డిసెంబర్ 21, 2029న , ఐదవ భాగం 'అవతార్ 5' డిసెంబర్ 19, 2031న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లోగా జేమ్స్ కామెరాన్ ఒక చారిత్రాత్మక పుస్తకం ఆధారంగా 'ది లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా' అనే మరో ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu