Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Badvel: వైద్యుల నిర్లక్ష్యం.. 15 ఏళ్ల బాలిక బలి: ఏఐవైఎఫ్ ఆగ్రహం

Badvel: వైద్యుల నిర్లక్ష్యం.. 15 ఏళ్ల బాలిక బలి: ఏఐవైఎఫ్ ఆగ్రహం

hmtv 3 weeks ago

Badvel: శ్రీనిధి అనే బాలిక మృతికి కారణమైన నిర్వాణ హాస్పిటల్ ను సీజ్ చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఆయన మాట్లాడుతూ బద్వేల్ మండలం గూడెం హరిజనవాడకు చెందిన శ్రీ నిధి అనే 15 సంవత్సరాల బాలిక ఆస్తమా వ్యాధితో బాధపడుతూ నిర్వహణ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వైద్యుల నిర్లక్ష్యంతో శ్రీనిధి కి అధిక డోసున్న ఇంజక్షన్లు ఇవ్వడంతో పరిస్థితి విషమించి విద్యార్థి చనిపోవడం జరిగింది.

విద్యార్థి మృతికి కారకులైన హాస్పిటల్ వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బద్వేల్ పట్టణంలో రాత్రి 8 దాటిన తర్వాత ఏ ఒక్క ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో లేకుండా కేవలం కాంపౌండర్లతో నైట్ డ్యూటీ చేసే అబ్బాయిలతో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఈ విధమైన దారుణాలకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు ఈ విధమైన దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన శ్రీనిధి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

బద్వేలు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్ లో ఎన్ని జరిగినా ఎన్ని అవంతరాలు జరిగినా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని అనేక దఫాలుగా వినతి పత్రాలు మరియు పత్రికల రూపంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలియజేసినప్పటికీ వాళ్ళు చేసే చర్యలకు వత్తాసు పలుకుతున్నారు.

తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిగా జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా వైద్యశాఖ అధికారులు హాస్పిటల్లో పరిశీలించి జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్లో సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఎఐవైయఫ్ నాయకులు రామకృష్ణ, మునిరత్నం, భరత్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu