Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balijipeta: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించాలి ఎమ్మెల్యే విజయ్

Balijipeta: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించాలి ఎమ్మెల్యే విజయ్

hmtv 2 weeks ago

Balijipeta: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించాలి ఎమ్మెల్యే విజయ్

బలిజిపేట: మండలంలోని గంగాడ, బలిజిపేట గ్రామాల్లో రెండో రోజు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సభలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ఇటువంటి సమావేశాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

గంగాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మినీ మహానాడులో ఎమ్మెల్యే పాల్గొని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

మినీ మహానాడు సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నదని, ఇదే స్ఫూర్తితో కార్యకర్తలంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమై విజయడంకా మోగించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్తలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందించారు. యువ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సభలో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కోరాడ రాజబాబు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బూరాడ రామ్మోహనరావు, పార్టీ నాయకులు గంట గౌరీశంకర్ రావు, రాజశేఖర్, సాయి, సంబంగి కృష్ణవేణి, గోపాలరావు, పాపి నాయుడు, అప్పారావు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu