Dailyhunt
Balkonda: బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్.. బాల్కొండలో చెక్కుల పంపిణీ!

Balkonda: బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్.. బాల్కొండలో చెక్కుల పంపిణీ!

hmtv 3 days ago

Balkonda: బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్.. బాల్కొండలో చెక్కుల పంపిణీ!

Balkonda: ఏర్గట్ల మండలములోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన షాహిన్ బి, నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన నాహెద బేగం, గుండు కార్తీక్, ఇటీవలే అనారోగ్యంతో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి లక్ష అయిదు వేల రూపాయలు విలువగల చెక్కులు మంజూరు కావడంతో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చెక్కులు మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మిర్యాల్ సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి, నాగేంద్ర నగర్ ఉప సర్పంచ్ షేక్ జాకీర్, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ షారుక్, హరీష్, శ్రీను, రఘుపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, గంగారెడ్డి, గంగభూమన్న, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu