నంద్యాల జిల్లా: బనగానపల్లెలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి భూములు ఇచ్చిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు అన్నారు.
రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానికులు లేరు స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులను సమీకరించి రాంకో సిమెంట్ దగ్గర ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సిపిఐ రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులతో, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ గారితో సంప్రదించి బనగానపల్లె రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నా నియోజకవర్గంలో ఉంది నేను కచ్చితంగా రైతులకు న్యాయం చేస్తానని సిపిఐ రాష్ట్ర నాయకులకు హామీ ఇచ్చారు.
ఈనెల 30వ తేదీన రాంకో సిమెంట్ యాజమాన్యం, పొల్యూషన్ బోర్డుతో రైతులకు న్యాయం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ స్థానికుతో కాకుండా బయటి వారితో భూములు కొనుగోలు చేస్తున్నారు. ఫ్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ భూములను రైతులు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ కి ఇచ్చారు. కానీ ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ భూములు రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారికి 20 ఎకరాలు అమ్మరని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయకులు అన్నారు. కార్యక్రమంలో బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.

