Banganapalle: మెడికల్ షాప్స్ క్లోజ్.. సీఐకి కెమిస్టుల వినతిపత్రం!
బనగానపల్లె: మెడికల్ స్టోర్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణీంద్ర రంగనాథ్ మౌలీశ్వర్ రెడ్డి అఖిలభారత కెమిస్టు ల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో ర్యాలీ నిర్వహించి బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఆన్ లైన్ మందులు అమ్మకాలు నిలిపివేయాలని కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ను నిలిపివేయాలని నకిలీ మందులు అమ్మకాన్ని నివారించాలి అని అన్నారు.
బనగానపల్లె పట్టణంలో మెడికల్ స్టోర్ లు అన్ని బంద్ చేయడం జరిగిందని చెప్పారు ఆన్ లైన్ మందుల విక్రయాలు ప్రజారోగ్యంపై వాటి ప్రభావం చూపుతాయని అన్నారు. లక్షలాదిమంది చిన్న కెమిస్ట్రీల జీవనోపాధి పై ఏర్పడుతున్న సమస్యలకు వ్యతిరేకంగా ఈ బంధు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రుడు రాఘవేంద్ర పరమేశ్వరుడు లలితా ప్రకాష్ సతీష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

