Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bapatla: ఆరు నెలల మగ శిశువు కిడ్నాప్..సీసీ కెమెరాలో దృశ్యాలు

Bapatla: ఆరు నెలల మగ శిశువు కిడ్నాప్..సీసీ కెమెరాలో దృశ్యాలు

hmtv 3 weeks ago

Bapatla: ఆరు నెలల మగ శిశువు కిడ్నాప్..సీసీ కెమెరాలో దృశ్యాలు

Bapatla: బాపట్ల జిల్లా,వేటపాలెం మండలం కొత్తపేట గ్రామా పంచాయితీలో ఆరుబయట నిద్రిస్తున్న తల్లి నుంచి ఆరు నెలల మగ శిశువును గుర్తు తెలియని దుంగదుడు అపహరించుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నిన్నటి అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోగా ,,ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మచిలీపట్టణంకు చెందిన కత్తి ఈశ్వరమ్మ ,సుబ్బారావు దంపతులు ఊరూరా తిరిగా చేత పేపర్లు వేరుకొని అవి అమ్మకం చేయగా వచ్చిన నగదుతో జీవనం సాగిస్తుంటారు .ఈక్రమంలోనే శిశువుతో చీరాలకు వచ్చిన బాధితులు.

కొత్తపేట,సంపత్ నగర్ కూడలిలో మూసి ఉన్న ఓ దుకాణం వద్ద ఆరుబయట నిద్రించారు.బాధిత మహిళా కత్తి ఈశ్వరమ్మ ఘాడ నిద్రలో ఉండగా తల్లి పక్కలోనే ఉన్న శిశువును అపరిచిత వ్యక్తి అపహరించుకుపోయాడు .

కాగా దుండగుడు శిశువును అపహరిస్తున దృశ్యాలు స్థానికంగా ఉన్న దుకాణానికి సంబందించిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి.బాధిత భార్యాభర్తల ఫిర్యాదుతో ,,సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ ముమ్మరం చేశారు .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu