Bapatla: జాతీయ రహదారిపై ఒక్కసారిగా పగిలిన టైర్.. కాలవలోకి దూసుకెళ్లిన లారీ!
Bapatla: గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ రన్నింగ్ లో టైర్ పగిలి పోవడంతో అదుపుతప్పి రహదారి మధ్యలోని సిమెంట్ దిమ్మిలను డీ కొంటూ రహదారి అంచున కాలవలోకి దూసుకుపోయి ఇరుక్కున్నది ఈ ఘటన శనివారం ఉదయం 16 జాతీయ రహదారిపై కొరిశపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ ను బయటకు తీశారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావటంతో 108 లో ఆసుపత్రికి తరలించారు.

