Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Basara: బాసర ఆర్జీయూకేటీలో నల్ల బ్యాడ్జీలతో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన!

Basara: బాసర ఆర్జీయూకేటీలో నల్ల బ్యాడ్జీలతో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన!

hmtv 18 mins ago

Basara: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల (UTAC University TeachersAssiciation contract) పిలుపుమేరకు ఈరోజు ఆర్జీయూకేటీ బాసరలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ డాక్టర్ కే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నత విద్యాభివృద్ధికి విశేష సేవలందిస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమానికి కాంట్రాక్ట్ అధ్యాపకులు సిద్ధమయ్యామని తెలిపారు.

ఒకవైపు యూనివర్సిటీలలో రెగ్యులర్ అధ్యాపకుల నియామక ప్రక్రియకు ప్రభుత్వం, అధికారులు వేగం పెంచుతున్న నేపథ్యంలో, మరోవైపు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు, కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త కార్యాచరణకు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు:

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ / అబ్జార్ప్షన్ ద్వారా క్రమబద్ధీకరించాలి.

కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ UGC పే స్కేల్స్ అమలు చేయాలి.

రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్:

18-11-2026: నల్ల రిబ్బన్లు ధరించి విధులకు, బోధనకు హాజరవుతూ నిరసన తెలియజేయాలి.

19-11-2026: March Towards Regularization పేరుతో ఆయా యూనివర్సిటీలలో నిరసన ర్యాలీలు నిర్వహించాలి.

20-11-2026: అన్ని యూనివర్సిటీలలో మానవహారాలు నిర్వహించాలి.

21-11-2026: యూనివర్సిటీ పరిపాలనా భవనాల ఎదుట మహాధర్నా నిర్వహించాలి.

ఈ ఉద్యమ కార్యక్రమాలను ఎలాంటి సంఘ భేదాలు, వ్యక్తిగత విభేదాలు లేకుండా రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమ కార్యాచరణ కమిటీ విజ్ఞప్తి చేసింది.

కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కమిటీ పేర్కొంది. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ వినోద్, డాక్టర్ అజయ్, డాక్టర్ దేవరాజు, డాక్టర్ విజయకుమార్, రవి, వినయ్, చరణ్ రెడ్డి, సతీష్ కుమార్, తిలక్ రెడ్డి, శ్రీకాంత్, హరికృష్ణ, ప్రభాకర్, భానుప్రియ, శిరీష, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

డా. కె. కృష్ణ ప్రసాద్

జనరల్ సెక్రటరీ

కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమ కార్యాచరణ కమిటీ

ఆల్ యూనివర్సిటీస్, తెలంగాణ

RGUKT, బాసర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu