Bejjur: బెజ్జూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారుల ఆనందం!
బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్* సహకారంతో బెజ్జూర్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నికాడి సంతోష్‌కు రూ.60,000కజ్జకారి అఖిలకు రూ.27,500 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ చెక్కులను ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు కొండ్ర జగ్గా గౌడ్, మొగవల్లి సర్పంచ్ కోడ్ప శంకర్, బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సామల రాజన్న తదితరులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు బాధిత కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

