Bhadradri Kothagudem: జూలూరుపాడులో రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనలు
Bhadradri Kothagudem: వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘ సభ్యులకు విత్తనోత్పత్తి పై అవగాహనా.
ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామంలో వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘ సభ్యులకు విత్తనోత్పత్తి పై అవగాహనా అనే కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగినది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృషి విజ్ఞాన కేంద్రం డా. టి. భరత్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరి రకాలు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వావిద్యాలయం వారు విడుదల చేసిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వావిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారి సాంకేతిక సహకారం తో వరి మరియు కంది లో విత్తన ఉత్పత్తి చేపడుతున్న వివరాలు రైతులకు తెలియపరిచారు.
శ్రీ పాండురంగ రావు , జూలూరుపాడు వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ రైతులు పోటీతత్త్వంతో మోతాదుకు మించి ఎరువులను వాడకం చెయ్యడం వలన భూసారం తగ్గిపోతుందని తెలియపరిచారు. పచ్చిరొట్ట పైర్లు జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర, మినుము వంటి వాటిని సాగు చేసుకొని పచ్చిరొట్ట పైర్లు గ వాడుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త బి శివ మాట్లాడుతూ రైతులు ఒకే రకమైన పంటలను పండిస్తున్నారు. అందువలన ఇది రైతులకు కూడా గిట్టుబాటు కావడం లేదు. కనుక రైతులు పంట మార్పిడి పాటించడం ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందటంతో పాటు నేలతల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ సీఈఓ, సభ్యులు మరియు అభ్యుదయ రైతులు మరియు 30 మంది రైతులు పాల్గొనడం జరిగినది.

