Bhumpally: సిసి కెమెరాలు ప్రారంభించిన సిఐ రాజేష్
భూంపల్లి: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ.
రాజేష్ మరియు భూంపల్లి ఎస్సై హరీష్ CCTV కెమెరాలను ప్రారంభించినారు. ఇట్టి కార్యక్రమంలో బేగంపేట గ్రామ సర్పంచ్ అన్న బోయిన చంద్రశేఖర్ మరియు పాలకవర్గం, గ్రామస్తులు మరియు గ్రామ విపిఓ వినిత పాల్గొన్నారు. అనంతరం దుబ్బాక సిఐ రాజేష్ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం అని ఎక్కడైనా దొంగతనం జరుగుతే సీసీ కెమెరా ద్వారా గుర్తుపట్టవచ్చని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలిపారు.

