Bodhan: వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు
బోధన్: బోధన్ డివిజన్ పరిధిలోని పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. పాడిపంటలు సుభిక్షంగా ఉండడంతో పాటు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వెలసిల్లాలని డివిజన్లోని సాలు రా, ఎడపల్లి, రెంజల్, రుద్రూర్, నవీపేట్
తదితర మండలాల్లో ఘనంగా గణేష్ మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు హోమం నిర్వహించారు. రుద్రూర్ లో 18 జంటలతో హోమం నిర్వహించి వేద పండితులు శివం శుక్ల పూజలు నిర్వహించారు.

