Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Boduppal: బోడుప్పల్ సమస్యలపై కమిషనర్‌కు వజ్రేష్ యాదవ్ వినతి

Boduppal: బోడుప్పల్ సమస్యలపై కమిషనర్‌కు వజ్రేష్ యాదవ్ వినతి

hmtv 5 days ago

Boduppal: బోడుప్పల్ సమస్యలపై కమిషనర్‌కు వజ్రేష్ యాదవ్ వినతి

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu