Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Boyakonda: బోయకొండలో ఎన్ఆర్ఐ శ్రీహరి నాయుడికి ఘన సన్మానం

Boyakonda: బోయకొండలో ఎన్ఆర్ఐ శ్రీహరి నాయుడికి ఘన సన్మానం

hmtv 2 days ago

Boyakonda: బోయకొండలో ఎన్ఆర్ఐ శ్రీహరి నాయుడికి ఘన సన్మానం

బోయకొండ: ఎన్ఆర్ఐ పాలఏకరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వగ్రామ అభివృద్ధికి చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

బోయకొండలో నిర్వహించిన కార్యక్రమంలో పాలఏకరి కులబాంధవులు శ్రీహరి నాయుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చిన్న వయసులోనే సమాజ సేవలో ముందుండి, కువైట్‌లో పాలఏకరి సంఘ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్వగ్రామ ప్రజల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీహరి నాయుడిని శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో లడ్డు రమణ, నాగరాజు నాయుడు, గుణశేఖర్ నాయుడు, ప్రకాష్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, దామోదర్ నాయుడు, ప్రవీణ్ రాయల్, ఆనంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బుజ్జి నాయుడు, చిన్ని నాయుడు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu