Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Burgampadu: కేంద్ర బృందానికి ఎమ్మెల్యే పాయం నివేదిక

Burgampadu: కేంద్ర బృందానికి ఎమ్మెల్యే పాయం నివేదిక

hmtv 3 days ago

Burgampadu: కేంద్ర బృందానికి ఎమ్మెల్యే పాయం నివేదిక

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకITC గెస్ట్ హౌస్ వేదికగాపోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ మండలం మరియు ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న, జరగబోయే వరదముంపు, నష్టనివారణ చర్యలు, ఆర్ధిక, సామాజిక, భౌగోలిక స్థితిగతులపై కేంద్ర బృందంతో[CWC] చర్చించి, సమగ్ర నివేదికను సమర్పించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు తదితర ప్రాంతాలలో రైతులు సామాన్య ప్రజలు, చిరు వ్యాపారము పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తీవ్ర నష్టం చవిచూస్తున్నారని వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి వారికి నష్టపరిహారం చెల్లించి కరకట్ట నిర్మాణం చేపట్టి పూర్తిస్థాయిలో శాశ్వత పరిష్కారం ముంపు ప్రాంతాల వారికి చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

కేంద్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాలలో ఎవరైతే నష్టపోతున్నారో వారందరికీ మంచి ప్యాకేజీ ఇచ్చి వారికి శాశ్వత పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu