Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Burning Topic: చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అమెరికా కన్ను?

Burning Topic: చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అమెరికా కన్ను?

hmtv 1 week ago

Burning Topic: చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అమెరికా కన్ను?

Burning Topic: అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అభ్యసించాలి.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి బంగారు భవిష్యత్తు నిర్మించుకుకోవాలి..

సగటు భారతీయ విద్యార్థుల డాలర్ గ్రీమ్స్ ఇవి. ఏటా వేలాది మంది భారతీయులు తమ కలలు పండించుకునేందుకు అమెరికా వెళుతుంటారు. ప్రతి ఏటా సుమారు 65,000 మందికి పైగా భారతీయులకు H-1B వీసాల ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా ఆమోదించే ఈ వీసాలలో అత్యధికంగా 71% నుండి 75% శాతం భారతీయులకే లభిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో చైనా వారు ఉంటారు. ఇక అమెరికాలోని మొత్తం కొత్త అంతర్జాతీయ విద్యార్థులలో భారత్, చైనా దేశాల వాటా కలిపి 42% శాతం ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వలస విధానంలో మార్పులు తేవడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో తమ అవకాశాలే కొల్లగొడుతున్నారని అమెరికన్లలో అపోహలు పెరిగాయి.

ఇటీవల అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ భారతీయుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా హెచ్‌1బీ వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఓ ట్వీట్ ద్వారా ఆరోపించారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్‌ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువు అయ్యాక హెచ్‌1బీ పొందుతారు. ఆ తర్వాత గ్రీన్‌కార్డు సాధిస్తారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్‌ గ్రాడ్యుయేట్లు పోటీపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో భారతీయులు ఉద్యోగాలను సాధిస్తుండటంతో పెద్ద టెక్‌ కంపెనీలు అమెరికన్లకు దారులు మూసేస్తున్నాయని, ప్రతిభ స్థానాన్ని జాతి పక్షపాతం ఆక్రమిస్తోందని ఆరోపించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది" అని వ్యాఖ్యానించారు.

తమ దేశ ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు సెనేటర్‌ ఎరిక్‌ ష్మిట్. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్‌ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. హెచ్‌1బీ, ఎల్‌1, ఎఫ్‌1, ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎరిక్‌ ష్మిట్ భారతీయులపై.. ముఖ్యంగా హైదరాబాదీయులపై అక్కసు వెళ్లగక్కారు తన ట్వీట్‌లో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రస్ధావించడం విశేషం. ఈ వీసా కార్టెల్‌కు ఒక వీసాల దేవాలయం ఉంది. వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్‌ వీసాలు లభించేలా పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు'' అని ష్మిట్‌ వ్యాఖ్యానించారు. చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్నీ తన పోస్టులో ఆయన ఉంచారు. ఇదే వీసాల దేవాలయమని, భారతీయులతోపాటు వీసా కార్టెల్‌ అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు.

అమెరికా సెనెటర్ అక్కసుతో చిలుకూరి బాలాజీ ఆలయం పేరు ప్రపంచ వార్తల్లోకి వచ్చేసింది. హైదరాబాద్ నగరానికి 25 నుంచి 30 కి.మీ దూరంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామంలో ఆ ఆలయం ఉంది. 500 సం.ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఆలయ ప్రాంగణం జాతరను తలపిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu