Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Burning Topic: పశ్చిమ బెంగాల్ లో చరిత్ర సృష్టించిన బీజేపీ

Burning Topic: పశ్చిమ బెంగాల్ లో చరిత్ర సృష్టించిన బీజేపీ

hmtv 3 weeks ago

Burning Topic: పశ్చిమ బెంగాల్ లో చరిత్ర సృష్టించిన బీజేపీ

Burning Topic: బీజేపీకి అత్యంత ఆనందాన్ని కలిగించిన విజయం ఇది. చాలా కాలంగా కమలనాథులు చేస్తున్న పోరాటం ఫలించింది.

గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కమలం విరబూసింది. ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటి దూసుకుపోయింది బీజేపీ. 200 సీట్లకు దగ్గరలో కమలదళం ఉంటే, టీఎంసీ 100లోపు సీట్లకే పరిమితమైపోయింది. ఈ భారీ విజయంలో బెంగాల్‌తో పాటు దేశమంతా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అవిజయం వెనుక బీజేపీ కచ్చిమైన వ్యూహాన్ని అనుసరిచింది. మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలపై బీజేపీ పోరాటలాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు జాతీయ స్థాయినేతలంతా రంగంలోకి దిగి ప్రచారం చేయడం కలిసొచ్చింది. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడంతో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలనే సుదీర్ఘ ఆకాంక్షలు ఫలించాయి.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితం అయింది. 10,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 40 స్థానాలు, 5,000 కంటే తక్కువ ఓట్లతో 20 స్థానాలు ఉన్నాయి. దీంతో 2026 ఎన్నికల కోసం ఎంతో ముందు చూపుతో ప్రణాళికలను తయారు చేసుకంది బీజేపీ. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్ల పుంజుకోవడానికి బూత్‌ స్థాయి మేనేజ్‌మెంట్‌కు తెరతీసింది. పోలింగ్‌ కేంద్రాల్లో బలమైనవి, దృష్టిపెట్టాల్సినవి, బలహీనమైనవి అంటూ మూడు వర్గీకరణలు చేసింది. టికెట్ల పంపిణీ విషయంలో సెలబ్రిటీలు, ఫిరాయింపుదార్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీ నాయకులకు భాజపా పెద్దపీట వేసింది. ప్రతి బూత్‌స్థాయిలో 300 ఓట్లను సమీకరించగల వారికే టికెట్లు కేటాయించింది. ప్రతి కార్యకర్త 10-15 కుటుంబాలతో సత్సంబంధాలు నెరిపి 30-60 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చేశారు. క్షేత్ర స్థాయిలో ఓటర్లందరినీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా వరకూ ఫలించాయి.

బీజేపీ 2021 ఎన్నికల్లో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. ఈసారి మాత్రం స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని లక్ష్యంగా చేసుకొని శ్రేణులు ప్రచారం చేశారు. 220 నియోజకవర్గాల్లోని టీఎంసీ ఎమ్మెల్యేలపై 'ఛార్జిషీట్లు' విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. 10,000 కిలోమీటర్ల మేరకు భాజపా పరివర్తన్‌ యాత్రను చేపట్టింది. ఫలితంగా టీఎంసీ 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సి వచ్చింది. మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు మొదటి నుంచీ అనుకూలించలేదుఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీకి మొదటి నుంచి అనుకూలించలేదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టీఎంసీకి అనుకూలంగా ఉన్న అధికారుల బదిలీలు, ఐప్యాక్‌పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతి 140 మంది ఓటర్లకు ఒక సిబ్బంది చొప్పున మొత్తం 2.4 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఎదురు దెబ్బ తగిలింది.

సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. టీఎంసీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, రాజకీయ హత్యలు, శాంతిభద్రతలు, నిరుద్యోగం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మహిళలపై జరిగిన నేరాల విషయంలో బెనర్జీ విమర్శలు ఎదుర్కొన్నారు. టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే విషయం మీద బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచారం, సందేశ్‌ఖాలీ ఘటనలు మహిళల భద్రతపై ఆందోళన పెంచాయి. బీజేపీ ఈ అంశాలను సమర్థవంతంగా ప్రచారంలోకి తీసుకెళ్లి మహిళా ఓటర్ల మద్దతు పొందింది. ఇక ఆర్జీకర్‌ ఆస్పత్రి బాధితురాలి తల్లికి కూడా పానిహటి నుంచి భాజపా టికెట్‌ కేటాయించి... దీంతో మమతా విజయావకాశాలను దెబ్బకొట్టినట్లయ్యింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలు తృణమూల్‌ను ఇరకాటంలో పడేశాయి. శారద చిట్స్, నారద కుంభకోణాలు టీఎంసీ ప్రతిష్ఠకు మచ్చగా మిగిలిపోయాయి.

బెంగాల్‌లో విజయాన్ని ప్రభావితం చేసే మహిళా ఓటర్ల మీద బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే టీఎంసీ నుంచి వారికి లక్ష్మీభాండార వంటి పలు పథకాలు అందుతున్నాయి. దీంతో అధికార టీఎంసీకి ధీటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా పథకాలను ప్రకటించారు. మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని మేనిపెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం మమతా సర్కారు ఇస్తున్న దానికిది రెట్టింపు. గర్భిణులకు రూ.21,000, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 33శాతం రిజర్వేషన్‌, యువతకు నెలకు రూ.3,000 భృతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఏక మొత్తంగా రూ.15,000 మద్దతు ప్రకటించింది. వరిని క్వింటాల్‌ రూ.3,100కు కొనుగోలు వాగ్దానం, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర వాటా పెంచి రైతులకు ఏటా రూ.9,000 చెల్లించేట్లు ఇచ్చిన హామీలు ఆకర్షించాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించడంలో ఆ పార్టీ సఫలమైంది

ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఓట్ల బదిలీ. ఒకప్పుడు బెంగాల్‌ను ఏలిన వామపక్షాల ఓటు బ్యాంకు క్రమంగా క్షీణించి, అది నేరుగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. "ముందు రాముడు.. తర్వాత వామపక్షం" అనే నినాదం క్షేత్రస్థాయిలో పని చేసింది. టీఎంసీని ఓడించగల ఏకైక శక్తి బీజేపీ అని నమ్మిన లెఫ్ట్ ఓటర్లు, వ్యూహాత్మక ఓటింగ్ ద్వారా బీజేపీకి మద్దతు పలికారు. ఇది అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపును సులభతరం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 70శాతం ఉన్న హిందూ ఓటర్ల ఏకీకరణే లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలోపెట్టుకొని వ్యూహాలను అమలు చేసింది. ఉత్తరబెంగాల్‌లో బీజేపీకి మంచి పట్టుంది. తేయాకు తోటల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రాజబోంగ్షీల సమస్యలపై దృష్టిపెట్టింది. వీరి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక్కడ 2 శాతం ఓట్లు పెరిగినా.. ఈ ప్రాంతంలో తమ సీట్లను 40కు పైగా పెంచుకొనే అవకాశాన్ని గ్రహించి వాడుకొంది. స్వయంగా అమిత్‌షా ఈ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu