Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Burning Topic: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే

Burning Topic: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే

hmtv 1 week ago

Burning Topic: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే

Burning Topic: దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో లేవు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ ఇతర సెస్సుల కారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. కాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటం గమనించవచ్చు.. ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున పెంపు నమోదైంది. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం, హర్ముజ్‌ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతినడంతో పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. ఈలోపు ప్రధాని మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 % వరకు పెరిగింది. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉండగా, అనంతర నెలల్లో అది 113-114 డాలర్లకు చేరింది.. ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయిందని చెబుతున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కూడా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు.ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా పెంచడంపైసామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుంది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగానికి చెందినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu