Cheepurupalli: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చీపురుపల్లి జంక్షన్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంధన ధరల పెంపు రైతులు, కార్మికులు, మధ్యతరగతిపై తీవ్ర భారం మోపుతోందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు మోపడం మానుకుని వెంటనే ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్మన్ శోభాస్వాతి రాణి, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

