Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cheepurupalli: ఫైన్లకు భయపడి కాదు, బాధ్యతతో ప్లాస్టిక్‌ను వదిలేయాలి

Cheepurupalli: ఫైన్లకు భయపడి కాదు, బాధ్యతతో ప్లాస్టిక్‌ను వదిలేయాలి

hmtv 1 week ago

Cheepurupalli: పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం కావాలి" అని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా, ఈ వారం "ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్" థీమ్‌తో శనివారం చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఫైన్లకు భయపడి కాదు, బాధ్యతతో మారాలి: ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ "అధికారులు ఫైన్లు వేస్తారనే భయంతో కాకుండా, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తు తరాలకు జరిగే తీవ్ర నష్టాన్ని గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా మారాలి. నిత్యజీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కవర్లను పూర్తిగా వదిలేయాలి. వాటి స్థానంలో పేపర్, క్లాత్ బ్యాగులను మాత్రమే వాడాలి" అని సూచించారు.

ఇంటింటికీ అవగాహన కార్యక్రమం

ప్లాస్టిక్ రహిత లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే నియోజకవర్గంలో అనేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. "రాబోయే రోజుల్లో సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. చీపురుపల్లిని వందశాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చే ఈ పవిత్ర ఆశయంలో ప్రతి పౌరుడు, వ్యాపారస్తులు భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu