Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chegunta: మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం

Chegunta: మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం

hmtv 4 days ago

Chegunta: మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం

చేగుంట: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఉష్ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ కొనుగోలు కేంద్ర ల లో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని, ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, అన్నారు, సమావేశంలో డైరెక్టర్లు ఎత్తిన పలు సమస్యలపై వెంటనే సంబంధిత స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో తో మాట్లాడడం జరిగింది, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయనికి కొత్తగా 25 కాంటాలు వచ్చినాయని,అవుసరం ఉన్న వారు (వి ఏ ఓ లు )వచ్చి, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుగలరని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu