Dailyhunt
Cherlapally: చర్లపల్లి కాంగ్రెస్‌లో ముదిరిన 'పాత - కొత్త' చిచ్చు

Cherlapally: చర్లపల్లి కాంగ్రెస్‌లో ముదిరిన 'పాత - కొత్త' చిచ్చు

hmtv 5 days ago

Cherlapally: చర్లపల్లి కాంగ్రెస్‌లో ముదిరిన 'పాత - కొత్త' చిచ్చు

Cherlapally: కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న కార్యకర్తలను పార్టీ అధిష్టానం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చర్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సమావేశం బుధవారం ఈసి నగర్‌లోని కమిటీ హాల్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం యాదగిరి మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకంతో ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినా, వెనుకడుగు వేయకుండా పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఐకమత్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

అయితే గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్త డివిజన్లు ఏర్పడిన నేపథ్యంలో ఉమ్మడి చర్లపల్లి డివిజన్‌లో నూతన కమిటీ ఏర్పాటు సమయంలో సుదీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి వారి గత రాజకీయ ప్రస్థానం, సేవలను పరిగణనలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా, రెండు రోజుల క్రితం నూతన కమిటీ ఏర్పాటు కోసం నిర్వహించిన సమావేశంలో కొంతమంది నేరపూరిత వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ ఒంటెద్దు పోకడలను తీవ్రంగా ఖండించారు.

ఈ సమావేశంలో పాత సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిలోనే ఒకరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాత సీనియర్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం.. నూతన కమిటీలో వారికి కీలక పదవులు ఇవ్వాలని డిమాండ్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గత చరిత్ర ఆధారంగా అవకాశాలు ఇవ్వాలన్న సూచన

నేరపూరిత వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్‌పై తీవ్ర విమర్శలు కాంగ్రెస్‌ను నమ్ముకుని కష్టపడిన వారికే నాయకత్వం ఇవ్వాలంటూ చర్లపల్లి నాయకుల స్పష్టం

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్రవణ్ కుమార్ గౌడ్, నిరజా రెడ్డి, బాలయ్య గౌడ్, వంశీ, ఆనంద్ రాజు గౌడ్, సర్పరాజ్, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, ప్రేమ్ కుమార్, బిక్షపతి, ముస్తాక్, కె.వి.ఎల్.ఎన్ రావు, లతీఫ్, స్వామి రాజు, డప్పు గణేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu