Choppadandi: ఉత్సాహంగా CPL-05 ఫైనల్ మ్యాచ్: క్రీడాకారులను అభినందించిన మేడిపల్లి సత్యం
కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) గ్రౌండ్‌లో నిర్వహించిన చొప్పదండి ప్రీమియర్ లీగ్ (CPL) సీజన్-05 ఫైనల్ మ్యాచ్ ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ ఫైనల్ పోటీకి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచిన 1వ వార్డ్ జట్టుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ట్రోఫీ మరియు బహుమతులు అందజేశారు. అలాగే పోరాట పటిమతో రన్నరప్‌గా నిలిచిన 12వ వార్డ్ జట్టును కూడా అభినందించి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో ముందుకు రావడం ఎంతో ఆనందకరమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
చొప్పదండి పట్టణంలో యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు CPL వంటి టోర్నమెంట్లు మంచి వేదికగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా పోటీలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, క్రీడాభిమానులు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.

