Chowdepalle: బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం కోరుతూ ప్రత్యేక పూజలు
చౌడేపల్లి: చౌడేపల్లి(మం) బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మృత్యుంజయేస్వర స్వామికి అఖండ దీపారాధన ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్ణాటక అభిమానులు
షూటింగ్‌లో గాయపడిన ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చౌడేపల్లిలోని అభీష్టద మృత్యుంజయ స్వామి వారి దేవస్థానంలో 42 రోజుల క్రితం కర్ణాటక చెందిన బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముళబాగిలు, కర్ణాటకకు చెందిన బసవతారక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నందమూరి అభిమానుల సంఘం చైర్మన్ సుబ్రమణ్యం, అధ్యక్షులు వాణిగనహళ్లి బాలకృష్ణ 44 రోజుల పాటు అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
బాలకృష్ణ ఆరోగ్యం కుదుట పడటంతో వారు శ్రీ అభీష్టత మృత్యుంజయశ్వర స్వామి ఆలయంలో తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభిమానుల ప్రార్థనలు ఫలించాయని, నటుడు బాలకృష్ణ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. త్వరలోనే ఆయన కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు.

