Dailyhunt
CM Chandrababu: అణు రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు!

CM Chandrababu: అణు రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు!

hmtv 1 week ago

CM Chandrababu: అణు రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు!

CM Chandrababu: తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) కీలకమైన 'క్రిటికాలిటీ'ని (అణు ప్రక్రియ ప్రారంభం) సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని, దేశ పౌర అణు ప్రస్థానంలో ఇదొక గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు.

భారత అణు కార్యక్రమం రెండో దశలో ఈ విజయం అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోని విస్తారమైన థోరియం నిల్వలను వినియోగించుకునే మూడో దశ అణు కార్యక్రమానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన వివరించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత అణు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల కృషిని ఆయన కొనియాడారు. వారి మేధస్సు, నిరంతర శ్రమ వల్లే దేశం ఈ స్థాయికి చేరుకుందని ప్రశంసించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఇంధన భద్రత దిశగా పటిష్టమైన అడుగులు వేస్తోందని చంద్రబాబు అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి (Atmanirbhar) సాధించడంలో ఇలాంటి విజయాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

ఈ రియాక్టర్ కార్యరూపంలోకి రావడం వల్ల దేశ దీర్ఘకాలిక ఇంధన అవసరాలు తీరతాయని, స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన శాస్త్రవేత్తలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu