Dailyhunt
Cumbum: దేవుడి నగలను కూడా వదలని దొంగ.. కంభం పోలీసుల వలలో కిలాడీ చోరుడు

Cumbum: దేవుడి నగలను కూడా వదలని దొంగ.. కంభం పోలీసుల వలలో కిలాడీ చోరుడు

hmtv 1 week ago

మ్బుమ్: చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మార్కాపురం జిల్లా కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలు, దుకాణాలు, యజమానులు లేని ఇళ్లను టార్గెట్ చేసి దొంగ చోరీలకు పాల్పడుతున్న విషయాన్ని మార్కాపురం డివిజన్ డిఎస్పి నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు.

బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపాని సాయి అర్ధవీడు, కంభం మండలాలలో 40 గ్రాముల బంగారాన్ని 25 తులాల వెండిని రూ.20 వేలు నగదు అపహరించాడు.

రావిపాడు లోని భీమలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు అర్ధవీడు మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగ చోరీకి పాల్పడ్డాడు. చోరీ చేసిన దేవుడి బంగారు ఆభరణాలతో పాటు వెండిని రికవరీ చేశామని రూ.20 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి వెల్లడించారు. దొంగని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. దొంగతనం కేసులను చేదించిన ఎస్ఐ శివకృష్ణారెడ్డి తో పాటు పోలీసు ఇబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu