Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dagadarthi: మాలేపాటి సుబ్బానాయుడు సేవలు మరువలేవు.. దగదర్తిలో ఘనంగా జయంతి వేడుకలు!

Dagadarthi: మాలేపాటి సుబ్బానాయుడు సేవలు మరువలేవు.. దగదర్తిలో ఘనంగా జయంతి వేడుకలు!

hmtv 1 week ago

Dagadarthi: మాలేపాటి సుబ్బానాయుడు సేవలు మరువలేవు.. దగదర్తిలో ఘనంగా జయంతి వేడుకలు!

దగదర్తి (నెల్లూరు జిల్లా): మాలేపాటి సుబ్బానాయుడు గారి జయంతి సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, సుబ్బానాయుడు చిత్ర పటానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర.

తెలుగుదేశం పార్టీలో సుధీర్ఘ కాలం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో సేవలందించిన మాలేపాటి సుబ్బానాయుడి 61వ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ఎవరూ ఊహించనటువంటి విధంగా సుబ్బానాయుడుని మనం కోల్పోయాం అని అన్నారు. స్వర్గీయ మాలేపాటి రామానాయుడు హయాం నుంచి దగదర్తి మండలంలో ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం వారి కుటుంబ సభ్యులు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు.

దాదాపు ఈ కుటుంబంతో తనకకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, సుబ్బానాయుడు, భాను, ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉన్నారని, అలాంటి వారిని కోల్పోవడం మనందరి దురదృష్టం అని అన్నారు.

వారి కుటుంబానికి సీఎం చంద్రబాబు, లోకేష్‌ , పల్లా శ్రీనివాస్‌, జిల్లా నాయకత్వం అండగా ఉందని చెప్పారు. ఇది తమ నైతిక బాధ్యత కూడా అని కూడా అన్నారు.

సుబ్బానాయుడి జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ఆర్దోపెడిక్‌ డాక్టర్‌ పెంచలయ్య, చిన్నపిల్లల డాక్టర్‌, అలాగే న్యూరాలజీ డాక్టర్‌ వైష్ణవి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. పేద కుటుంబాల విద్య, వైద్యం కోసం పనిచేస్తామని సుబ్బానాయుడు కుటుంబం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. సుబ్బానాయుడు కుటుంబానికి భగవంతుడి దీవెనలు ఉండాలని, మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నానని అన్నారు బీద రవిచంద్ర.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu